నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

షాకింగ్ రూ. 4 వేలు తగ్గిన వెండి.. ఇక బంగారం రేటు

బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్న వారికి మళ్లీ షాకింగ్ న్యూస్ వచ్చింది. ఎందుకంటే దేశవ్యాప్తంగా బంగారం, వెండి ధరలు మళ్లీ పుంజుకున్నాయి..

వరుసగా మూడో రోజు కూడా రేట్లు పెరిగాయి. ఇటివల పసిడి ధర రికార్డు స్థాయిలో 80 వేల స్థాయిని దాటగా, గతవారం 76 వేల స్థాయికి దిగివచ్చింది. కానీ ఇప్పుడు మళ్లీ ఈ ధరలు పెరగడం విశేషం. ప్రపంచవ్యాప్తంగా ఉన్న భౌగోళిక, రాజకీయ, ఆర్థిక కారణాలతోపాటు స్టాక్ మార్కెట్ల ధోరణులు కూడా ఈ బంగారం ధరల హెచ్చుతగ్గులపై ప్రభావం చూపుతాయి.

నేటి ధరలు ఎలా ఉన్నాయంటే..

ఈ నేపథ్యంలో నేడు (నవంబర్ 21న) ఉదయం 6.28 గంటల నాటికి హైదరాబాద్‌, విజయవాడలో 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 550 పెరిగి రూ. 77,630కి చేరుకుంది. ఇక 22 క్యారెట్ల 10 గ్రాముల పుత్తడి ధర రూ. 71,160 స్థాయికి చేరింది. ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి రేటు 10 గ్రాములకు రూ. 77,780కి చేరుకోగా, 22 క్యారెట్ల పుత్తడి ధర 10 గ్రాములకు రూ.71,310కి చేరాయి. ఇదే సమయంలో వెండి ధరలు కిలోకు 4000 రూపాయలు తగ్గడం విశేషం. దీంతో దేశంలోని ప్రధాన నగరాల్లో ఉన్న బంగారం, వెండి రేట్లను ఇక్కడ తెలుసుకుందాం.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు (10 గ్రాములకు) (24 క్యారెట్) (22 క్యారెట్)

హైదరాబాద్‌లో రూ. 77,630, రూ. 71,160

ఢిల్లీలో రూ. 77,780, రూ. 71,310

విజయవాడలో రూ. 77,630, రూ. 71,160

వడోదరలో రూ. 77,680, రూ. 71,210

చెన్నైలో రూ. 77,630, రూ. 71,160

ముంబైలో రూ. 77,630, రూ. 71,160

బెంగళూరులో రూ. 77,630, రూ. 71,160

పూణేలో రూ. 77,630, రూ. 71,160

కేరళలో రూ. 77,630, రూ. 71,160

కోల్‌కతాలో రూ. 77,630, రూ. 71,160

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కిలోకు)

బెంగళూరులో రూ. 92,100

ఢిల్లీలో రూ. 92,100

హైదరాబాద్‌లో రూ. 100,900

విజయవాడలో రూ. 100,900

ముంబైలో రూ. 92,100

కేరళలో రూ. 100,900

చెన్నైలో రూ. 100,900

భువనేశ్వర్‌లో రూ. 100,900

కోల్‌కతాలో రూ. 92,100

అహ్మదాబాద్‌లో రూ. 92,100

వడోదరలో రూ. 92,100

గమనిక: పైన పేర్కొన్న బంగారం, వెండి రేట్లు ఎప్పటికప్పుడూ మారుతుంటాయి. కాబట్టి వీటిని కొనుగోలు చేసే సమయంలో మళ్లీ ధరలు తెలుసుకోవాలని సూచన..

Join WhatsApp

Join Now

Leave a Comment