Site icon PRASHNA AYUDHAM

పటాన్ చెరులో కోటి దీపోత్సవ కార్యక్రమ ఆహ్వాన పత్రిక అందజేత

IMG 20251010 200939

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 10 (ప్రశ్న ఆయుధం న్యూస్): శివ భక్తులు, బ్రహ్మశ్రీ దోర్భల గుణాకర్ శర్మ ఆధ్వర్యంలో సంస్కృతి నిర్మాణ్ ట్రస్ట్ పటాన్ చెరులో నిర్వహించబోతున్న “మహా కోటి దీపోత్సవం” కార్యక్రమానికి సంబంధించి ఆహ్వాన పత్రికను బీఆర్ఎస్ పార్టీ నాయకుడు, ఎండీఆర్ ఫౌండేషన్ కో-ఫౌండర్ మాదిరి ప్రిథ్వీరాజ్ ను ట్రస్ట్ సభ్యులు మర్యాదపూర్వకంగా కలిసి అందజేశారు. ఈ సందర్భంగా నిర్వాహకులు ఈ మహా దీపోత్సవం అక్టోబర్ 22వ తేదీ నుండి నవంబర్ 20వ తేదీఅనంతరం వరకు పటాన్ చెరు డివిజన్ పరిధిలోని వాల్యూ మార్ట్ ఎదురుగా జరగనుందని తెలిపారు. అనంతరం మాదిరి ప్రిథ్వీరాజ్ మాట్లాడుతూ.. లోకహితానికి, సమాజ శాంతి స్థాపనకు దోహదపడే ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొనడం అదృష్టంగా భావిస్తున్నానని అన్నారు. ఈ కార్యక్రమం విజయవంతంగా నిర్వహించడానికి అవసరమైన సహకారం ఎప్పుడూ అందిస్తానని తెలిపారు. అదే విధంగా నెల రోజుల పాటు మహోన్నతంగా జరగబోయే శ్రీ హరి హరుల మహా కోటి దీపోత్సవంలో పటాన్చెరు పరిధిలోని ప్రతి భక్తుడు పాల్గొని దీపాలను వెలిగించి పటాన్చెరు పట్టణ వ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభను మరింత పెంచాలని ప్రజలను ఆయన కోరారు.

Exit mobile version