పూలమాలతో గాంధీ విగ్రహానికి ఘన నివాళి.

పూలమాలతో గాంధీ విగ్రహానికి ఘన నివాళి

ప్రశ్న ఆయుధం కామారెడ్డి, అక్టోబరు 02:

నేడు మహాత్మా గాంధీ 156వ జయంతి సందర్భంగా కామారెడ్డి పట్టణంలోని గాంధీ గంజ్‌లో గల గాంధీ విగ్రహానికి పూలదండ తో సత్కరించి  గాంధీజీ మార్గంలో ప్రజలందరూ నడవాలని సమాచార హక్కు చట్ట పరిరక్షణ కమిటీ సభ్యులు పిలుపునిచ్చారు.

ఈ సందర్భంగా వికలాంగుడైన రవికుమార్‌ను పూలమాలతో సత్కరించి, వికలాంగులకు ఎల్లవేళలా తాము సహాయపడతామని రాష్ట్ర డైరెక్టర్ ఎం.ఏ. సలీం అన్నారు.

ఈ కార్యక్రమంలో జిల్లా చైర్మన్ శివపూజ లిబ్బయ్య, ప్రధాన కార్యదర్శి ఎం.వి. భాస్కర్, జోనల్ అధ్యక్షుడు సిర్నాపల్లి ప్రదీప్ కుమార్, న్యాయ సలహాదారులు ఇక శ్రీనివాసరావు, మానవ హక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, రాజేశ్వర్, అనిల్ కుమార్, అన్వర్ గౌరీ తదితరులు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ, గాంధీ మార్గంలో అహింస పథాన్ని అనుసరించాలన్నారు. ఐక్యరాజ్యసమితి గాంధీ జయంతిని అంతర్జాతీయ అహింసా దినంగా గుర్తించిందని, ప్రజలు అహింసతో ముందుకు సాగాలని తెలిపారు.

Join WhatsApp

Join Now