పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన కలెక్టర్

ఓటర్ల సౌకర్యాలపై అధికారులకు ఆదేశాలు

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 04

 

జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ శనివారం దోమకొండ మండలంలోని గొట్టిముక్కల గ్రామ పంచాయతీలో ఏర్పాటు చేయనున్న MPTC/ZPTC, సర్పంచ్ ఎన్నికల పోలింగ్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఓటర్ల సౌకర్యార్థం పోలింగ్ కేంద్రాల్లో మరుగుదొడ్లు, విద్యుత్ సదుపాయాలు తప్పనిసరిగా ఉండాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. దివ్యాంగులు సులభంగా ఓటు వేయగలిగేలా ర్యాంపులు ఏర్పాటు చేయాలని ఎంపీడీవోను సూచించారు. అనంతరం ఆర్&బి రహదారి దెబ్బతిన్న భాగాలను వెంటనే మరమ్మతులు చేయాలని సంబంధిత కాంట్రాక్టర్‌కు ఫోన్ ద్వారా ఆదేశించారు. ఈ కార్యక్రమంలో డిఆర్డిఓ సురేందర్, డిసిఎస్ఓ వెంకటేశ్వరరావు, స్థానిక తహసీల్దార్, ఎంపీడీవో తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now