పోలీస్ కళాబృందం చే అవగాహన కార్యక్రమం
ప్రశ్న ఆయుధం
కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 29
శనివారం రోజున కామారెడ్డి జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ రాజేష్ చంద్ర ఆదేశాల మేరకు కామారెడ్డి జిల్లా పోలీస్ కళాబృందం ఆర్టిఏ ఆఫీస్ కామారెడ్డి ఆవరణలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ అవగాహన కార్యక్రమంలో సైబర్ నేరాలు ప్రజలకు ఎదురైనప్పుడు టోల్ ఫ్రీ నెంబర్ 1930 కి కాల్ చేసిన వెంటనే కేసులు కూడా నమోదు చేయాలని తెలియజేశారు. మహిళలకు సమస్యలు ఎదురైనప్పుడు 8712686094 ఈ ఫోన్ నెంబర్ కు కాల్ చేసి సమస్యను తెలుపవచ్చని, అలాగే ఎటువంటి సమస్యలైనా పోలీస్ శాఖ తరపున సహాయం కావలసినప్పుడు డయల్ 100 కు కాల్ చేయాలని తెలిపారు. రోడ్డు ప్రమాదాల నివారణకై అందరూ హెల్మెట్ తప్పనిసరిగా ధరించాలని, డ్రంక్ అండ్ డ్రైవ్, సెల్‌ఫోన్ డ్రైవింగ్, మాదక ద్రవ్యాల గంజాయి, డ్రగ్స్ సేవించి యువత పెడదారి పట్టకుండా తీసుకోవలసిన చర్యలను ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో పోలీస్ కళాబృందం ఇన్చార్జ్ హెడ్‌కానిస్టేబుల్ రామంచ తిరుపతి, శేషారావు,ప్రభాకర్,సాయిలు పాల్గొన్నారు.