ప్రజల ఆర్జీల పరిష్కారానికి అధికారులకు కలెక్టర్ ఆదేశాలు
ప్రజావాణి కార్యక్రమంలో 60 ఆర్జీలు స్వీకరణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
ప్రశ్న ఆయుధం అక్టోబర్ 6
సోమవారం కామారెడ్డి కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రజావాణి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రజలనుండి వివిధ సమస్యలపై మొత్తం 60 ఆర్జీలను స్వీకరించారు. ప్రజలు తీసుకువచ్చిన ఫిర్యాదులు, అభ్యర్థనలను శ్రద్ధగా పరిశీలించి, వాటి పరిష్కారానికి సంబంధిత శాఖల అధికారులను తక్షణ చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు.
జిల్లా ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించడం ప్రభుత్వ ప్రాధాన్యమని ఆయన తెలిపారు. ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.