ప్రజావాణి కార్యక్రమం సోమవారం
కలెక్టరేట్‌లోని 25వ గదిలో ప్రజల ఆర్జీలు స్వీకరణ
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 04
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రకటించారు. ఈ నెల 6వ తేదీ సోమవారం నాడు కలెక్టరేట్‌లో ప్రజావాణి కార్యక్రమం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా కలెక్టరేట్‌లోని రూమ్ నెంబర్ 25లో ప్రజల నుండి ఆర్జీలు స్వీకరించనున్నట్లు తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు.