సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): రెండవ స్థానిక సంస్థల ఎన్నికల 2025, ఎంపీటీసీ, జడ్పీటీసీ, సర్పంచ్, వార్డు సభ్యుల స్థానిక ఎన్నికల ఏర్పాట్లు పూర్తయినట్లు జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య తెలిపారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో గుర్తింపు పొందిన రాజకీయ పార్టీ ప్రతినిధులు, అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భముగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ… రాష్ట్ర ఎన్నికల కమిషన్, స్థానిక సంస్థల ఎన్నికలకు షెడ్యూల్ విడుదల చేసిన నేపధ్యంలో నిన్నటి నుండి ఎంసీసీ (మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్) కోడ్ కచ్చితంగా అమలులో ఉంటుందని అన్నారు. ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంసీసీ నిబంధనలకు అనుగుణంగా వ్యవహరించాలని తెలిపారు. రాజకీయ పార్టీ ప్రతినిధులకు ఏవైనా సందేహాలు ఉంటే అధికారులతో సమగ్రంగా నివృత్తి చేసుకోలావని తెలిపారు. ఎన్నికల కోడ్ నిబంధనలు, లా అండ్ ఆర్డర్ నిబంధనలు 100 శాతం పాటించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని స్పష్టంగా పేర్కొన్నారు. ఎన్నికల కోడ్ అమలులోకి వచ్చిన నేపథ్యంలో రాజకీయ పార్టీల నాయకులు, యువత సోషల్ మీడియా వినియోగం విషయంలో జాగ్రత్తగా ఉండాలని సూచించారు. జిల్లాలో జడ్పీటీసీ 25, ఎం.పీ.టీ.సీ 261 స్థానాలకు రెండు విడతలలో ఎన్నికలు నిర్వహించేలా చర్యలు తీసుకున్నామని అన్నారు. జిల్లాలో మొత్తం 613 గ్రామ పంచాయతీలకు గాను తొలి విడతలో 334 జీ.పీలు, 2872 వార్డులు, రెండవ విడతలో 279 జీ.పీలు, 2498 వార్డులో ఎన్నికలు నిర్వహించేలా ప్రణాళికలు రూపొందించామని అన్నారు. ఎన్నికల నిర్వహణకు అవసరమైన సిబ్బందిని నియమిస్తూ, వారికి మలివిడత శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నామని రాజకీయ పార్టీ ప్రతినిధులకు తెలిపారు. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, జడ్పీ సీఈఓ జానకిరెడ్డి, డీపీఓ సాయిబాబా, జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి జగదీష్, కాంగ్రెస్ పార్టీ. పాషా, బిఆర్ఎస్ తారాసింగ్, బిజెపి తులసి రెడ్డి, సిపిఎం అడివయ్యా, సిపిఐ కృష్ణ, ఎంఐఎం యాకూబ్ అలీ, టిడిపి బదయ్య, బీఎస్పీ డేవిడ్, సంబంధిత అధికారులు తదితరులు పాల్గొన్నారు.
ప్రభుత్వ ఉద్యోగులు, రాజకీయ పార్టీ ప్రతినిధులు ఎంసీసీ కచ్చితంగా పాటించాలి: జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య
Oplus_131072