తిమ్మాపూర్ లో ఖరీఫ్ ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభం

ఎల్లారెడ్డి, అక్టోబర్ 1, ప్రశ్న ఆయుధం:

2025-26 ఖరీఫ్ సీజన్‌కు ప్రభుత్వం ప్రకటించిన కనీస మద్దతు ధరల మేరకు ఎల్లారెడ్డి మండలంలోని తిమ్మాపూర్ గ్రామంలో ధాన్యం కొనుగోలు కేంద్రం ప్రారంభమైంది. జిల్లా కలెక్టర్ ఆదేశాలపై గ్రామీణాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ కేంద్రం ఏర్పాటు చేయబడింది.ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరల ప్రకారం గ్రేడ్ ‘ఏ’ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2389, సాధారణ రకం ధాన్యం క్వింటాల్‌కు రూ.2369. అదనంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సన్న రకానికి క్వింటాల్‌పై రూ.500 బోనస్ అందజేయనుంది.

అధికారులు మాట్లాడుతూ రైతులు ధాన్యం నేరుగా కొనుగోలు కేంద్రాలకు అందజేస్తే మద్యవర్తుల జోక్యం లేకుండా న్యాయమైన ధరలు లభిస్తాయని తెలిపారు. చెల్లింపులు నేరుగా రైతుల బ్యాంక్ ఖాతాల్లో జమ కానున్నాయి.

ఇందుకు రైతులు తమ పాస్‌బుక్, ఆధార్ కార్డు మరియు బ్యాంక్ వివరాలు తీసుకురావాల్సి ఉంటుంది.

Join WhatsApp

Join Now