బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

బతుకమ్మ ఉత్సవాల్లో పాల్గొన్న జిల్లా కలెక్టర్

 

కలెక్టరేట్లో ఘనంగా జి.ఆర్.డి. శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు

ముఖ్య అతిథిగా పాల్గొన్న జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్

ప్రశ్న ఆయుధం   కామారెడ్డి జిల్లా సెప్టెంబర్ 30

తెలంగాణ సంస్కృతిని మరువకుండా బతుకమ్మ వేడుకలను ఘనంగా నిర్వహిస్తున్న ప్రభుత్వ శాఖల సిబ్బందిని జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ ప్రశంసించారు. కలెక్టరేట్‌ ప్రాంగణంలో జిల్లా గ్రామీణ అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో కలెక్టర్ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. గత తొమ్మిది రోజులుగా ఉత్సాహంగా నిర్వహించిన బతుకమ్మ వేడుకల్లో భాగంగా పాల్గొన్న అధికారులకు. ఈ వేడుకలో సిబ్బందికి మేమంటోళ్లను కలెక్టర్ అందజేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, “తెలంగాణ సంస్కృతి, సాంప్రదాయాలకు నిలువుటద్దంగా నిలిచే బతుకమ్మ పండుగను అన్ని శాఖల సిబ్బంది ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు. వారి చొరవ వలన ఈ వేడుకలకు ప్రత్యేక వన్నె చేకూరిందని జిల్లా కలెక్టర్ అన్నారు.

ఈ బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్న మహిళా సిబ్బందికి కలెక్టర్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

Join WhatsApp

Join Now