సంగారెడ్డి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సదాశివపేట పట్టణంలోని 12వ వార్డులో సద్దుల బతుకమ్మను పురస్కరించుకొని కాంగ్రెస్ రాష్ట్ర నాయకుడు పులిమామిడి రాజు సతీమణి పులిమామిడి మమత తమ వార్డు సభ్యులందరితో కలిసి బతుకమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా జరుపుకున్నారు. ఈ సందర్భంగా పులిమామిడి మమత మాట్లాడుతూ.. బతుకమ్మ అంటే బతుకును నేర్పేదని, తెలంగాణ సంసృతి ఉట్టిపడేలా రంగు రంగుల పూలను ఒకే దగ్గర చేర్చి తయారు చేసే పూల పండుగ అని అన్నారు. దసరా నవరాత్రులలో భాగంగా తొమ్మిది రోజులు బతుకమ్మలను పేర్చి మహిళలందరూ కలిసి బతుకమ్మ పాటలు పాడుతూ, ఆటపాటలతో, కోలాటాలతో బతుకమ్మ సంబురాలను కన్నుల పండుగగా జరుపుకుంటామని తెలిపారు. చివరి రోజున పెద్ద ఎత్తున సద్దులబతుకమ్మలను తయారు చేసి చెరువుల దగ్గరకు తీసుకొని వెళ్లి గౌరమ్మను పసుపుతో తయారుచేసి బతుకమ్మలో అమర్చి బతుకమ్మలను ఆడి తదుపరి, మహిళలందరిని సంతోషంగా, చల్లంగా చూడమని, పోయిరా బతుకమ్మ పోయిరా అంటూ మళ్ళీ వచ్చే ఏడాది రమ్మని సంతోషంగా ఆ బతుకమ్మలను చెరువులో నిమర్జనం చేస్తామని పులిమామిడి మమత అన్నారు. ఈ బతుకమ్మ వేడుకల్లో పాల్గొన్న ఆడపడుచులందరికి వారు బతుకమ్మ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో తన కుమార్తె పులిమామిడి మాధవి, స్వరూప, అరుణ, తాలెల్మ రాణి, విజయ, వైట్ల అపర్ణ, లక్ష్మి తదితరులు పాల్గొన్నారు.
బతుకమ్మ సంబురాల్లో పాల్గొన్న పులిమామిడి మమత
Oplus_131072