బిచ్కుంద లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల పై అవగాహన సదస్సు

బిచ్కుంద లో నిషేధిత పొగాకు ఉత్పత్తుల పై అవగాహన సదస్సు

ప్రశ్న ఆయుధం 31 మే (బిచ్కుంద ప్రతినిధి)

బిచ్కుంద న్యాయ సేవా సంస్థ ఆధ్వర్యంలో శనివారం నిసేధిత పొగాకు ఉత్పత్తుల పై బిచ్కుంద జూనియర్ సివిల్ కోర్టు జడ్జి జె.వినీల్ కుమార్ చే అవగాహన సదస్సు నిర్వహించారు. ఒకప్పుడు మనసులు 70,100 సంవత్సరాలు జీవించే వారని ఇప్పుడు నిషేధిత పొగాకు ఉత్పత్తులకు అలవాటు పడడంతొ 30,40 సంవత్సరాలకే గుండె నొప్పి తొ మృత్యు వాత పడుతున్నారని అన్నారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాల పై ప్రతి ఒక్కరు అప్రమత్తంగా ఉంటూ దాన్ని పూర్తిగా నియంత్రించాలని సూచించారు. కార్యక్రమం లొ ముఖ్య అతిథిగా హాజరైన జడ్జి జె. వినీల్ కుమార్ మాట్లాడుతూ ప్రస్తుత పరిస్థితుల్లో నిషేధిత పొగాకు ఉత్పత్తులతొ మనుషులపై తీవ్ర మైన ప్రభావం చూపి ప్రాణాలు బలిగొంటుందని అన్నారు. దిని ఉపయోగం ద్వార కలిగే నష్టం పై ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పై ఉందని అన్నారు. నియోజక వర్గం లొ పొగాకు ఉత్పత్తుల నియంత్రణ పకడ్బందీగా అమలు చేయాలని ఎక్స్ సైజ్, పోలీసులకు సూచించారు. పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాల గురించి ప్రతి ఒక్కరు బాధ్యత వహించి ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలని అన్నారు. ధూమపానల వాడకం ద్వార వచ్చే వ్యాధుల పై కార పత్రాలు, గోడ పత్రాల ద్వార ప్రత్యేక సమావేశాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని కోరారు. నేటి పరిస్థితి లొ ముఖ్యంగా పొగాకు వాడడం వల్ల బీడీ కార్మికులు అనారోగ్య బారిన పడే అవకాశం ఉందని వారికి ప్రత్యామ్నాయ ఉపాధి కల్పించే దిశగా చర్యలు చేపట్టాలన్నారు. ముఖ్యంగా విద్య సంస్థ లలో పొగాకు ను నియంత్రించేలా చూడాలని అన్నారు. ఈ నిబంధనలు అన్ని మండలాల్లో అమలు చేయాలని న్యాయ మూర్తి వినీల్ కుమార్ ఆదేశించారు. ఈ నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠిన చర్యలు విధించాలని ఆయన అన్నారు. అనంతరం పొగాకు ఉత్పత్తుల నిర్మూలన కు కృషి చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. కార్యక్రమం లో సర్కిల్ ఇన్స్పెక్టర్ జె. నరేష్, ఎక్స్ సైజ్ సి ఐ, సత్యనారాయణ , మున్సిపల్ సిబ్బంది, ఎస్సై మోహన్ రెడ్డి,బార్ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రకాశ్ పాటిల్, న్యాయవాదులు లక్ష్మణ్ రావు, మల్లేష్ రావు ,మనోజ్,శివాజీ, మొహమ్మద్, లీగల్ సర్వీస్ సెక్షన్ అథారిటీ అధికారి సుదర్శన్ గౌడ్,కార్యదర్శులు , సభ్యులు, పోలీసులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment