బీజేపీ కార్యకర్తలను పరామర్శించిన నాయకులు కోనేరు శశాంక్
ప్రశ్న ఆయుధం 15 మార్చి ( బాన్సువాడ ప్రతినిధి )
రుద్రూర్ మండలంలోని చిక్కడపల్లి గ్రామం,అంబం గ్రామాలలో బిజెపి కార్యకర్తలను రుద్రూర్ బీజేపీ మండల కమిటీ పిలుపు మేరకు బాన్సువాడ నియోజకవర్గ నాయకులు ఎన్ఆర్ఐ కోనేరు శశాంక్ ఇటీవల కారు ప్రమాదంలో చిక్కడపల్లి గ్రామ భూత్ అధ్యక్షులు భార్య కుమారులకు గాయాలు కావడంతో గుడిసె ప్రభాకర్ ను పరామర్శించారు.నిన్న అగ్ని ప్రమాదం లో రెండు ఇండ్లు కాలిపోయిన విషయం తెలుసుకున్న కోనేరు శశాంక్ ఆ కుటుంబ సభ్యులకు ఆర్థిక సహాయం చేసి 25 కిలోల బియ్యం అందించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ కన్వినర్ గుడుగుట్ల శ్రీనివాస్ జిల్లా కౌన్సిల్ మెంబర్ ప్రశాంత్ గౌడ్ పలు మండలాల అధ్యక్షులు హరికృష్ణ సున్నం సాయిలు నాయకులు కార్యకర్తలు గజేందర్ వడ్ల సాయినాథ్ గంగాధర్ సాయిప్రసాద్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు.