బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్మ బాలకృష్ణ నియామకం
కామారెడ్డిలో జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు ప్రకటింపు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
( ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 1
కామారెడ్డి జిల్లా భారతీయ జనతా పార్టీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్మ బాలకృష్ణ ని నియమిస్తూ జిల్లా అధ్యక్షుడు నీలం చిన్న రాజులు సోమవారం రోజు పార్టీ జిల్లా కార్యాలయంలో అధికారికంగా ప్రకటించారు. మున్సిపల్ పరిధిలోని దేవునిపల్లి గ్రామానికి చెందిన బాలకిషన్ గతంలో భారతీయ జనతా పార్టీ గ్రామ అధ్యక్షుడిగా, అలాగే రాష్ట్ర కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యునిగా కీలక బాధ్యతలు నిర్వహించారు. తాజాగా జిల్లా ఉపాధ్యక్షుడిగా నియమించడంపై ఆయన పార్టీ నేతలకు కృతజ్ఞతలు తెలిపారు. రాబోయే స్థానిక ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థుల విజయానికి కృషి చేస్తానని బాలకిషన్ స్పష్టం చేశారు.
బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడిగా తుమ్మ బాలకృష్ణ నియామకం
by CH Rajkumar
Updated On: October 1, 2025 9:40 am