Site icon PRASHNA AYUDHAM

బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో విద్యార్థులకు సన్మానం

IMG 20251005 183334

Oplus_131072

సంగారెడ్డి, అక్టోబర్ 5 (ప్రశ్న ఆయుధం న్యూస్): నీట్ ప్రవేశ పరీక్షలో విజయం సాధించి ఎంబీబీఎస్ సీట్ సాధించిన విద్యార్థులను సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఆదివారం సంగారెడ్డిలో గల వైయస్సార్ భవన్ లోని సంగారెడ్డి జిల్లా బీసీ సంక్షేమ సంఘం తరపున ఎంబీబీఎస్ ప్రవేశ పరీక్షలు విజయం సాధించిన జంగం ధీరజ్ స్వామి, మఠం బిల్వ శ్రేష్ట, పట్లోళ్ల సుదీప, చల్మెడ మహాదేవ్ పడిశెట్టి శ్రావ్య మడపతి కాత్యాయని, నాయి కోటి కీర్తనలను పూలమాలలు, మెమెంటోలు, శాలువాలతో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా రాష్ట్ర కార్యనిర్వాక అధ్యక్షుడు ప్రభుగౌడ్ మాట్లాడుతూ.. డాక్టర్లు సంఘంలో చాలా ప్రధాన పాత్ర వహిస్తారని, అలాగే వైద్య నారాయణ హరి అన్నారని పేర్కొన్నారు. డాక్టర్ మల్లికార్జున మాట్లాడుతూ.. మీరు కాబోయే డాక్టర్లు ఇక్కడికి ఆపకుండా ఎమ్మెస్ ఎండి చేసి మంచి భవిష్యత్తును సాధించగలరని మనస్ఫూర్తిగా కోరుతున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో ప్రధాన కార్యదర్శి గోకుల్ కృష్ణ, జిల్లా అధ్యక్షుడు పట్లోళ్ల మల్లికార్జున్, ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్ స్వామి, ముఖ్య సలహాదారులు చంద్రయ్య స్వామి, కార్యదర్శి సుధాకర్ గౌడ్, అధికార ప్రతినిధి మంగ గౌడ్, కార్మిక విభాగ అధ్యక్షుడు సుదర్శన్, యువజన విభాగం అధ్యక్షుడు జావీద్, సంగమేశ్వర్, శివ, ప్రభు, ఎన్. శివకుమార్, మహిళా అధ్యక్షురాలు మంజులగౌడ్, ప్రధాన కార్యదర్శి వీరమణి, నిర్మల తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version