మత్తు పదార్థాలపై అవగాహనతో పాటు క్రికెట్ టోర్నమెంట్‌కు యువత అద్భుత స్పందన

*మత్తు పదార్థాలపై అవగాహనతో పాటు క్రికెట్ టోర్నమెంట్‌కు యువత అద్భుత స్పందన*

ముప్పల్ పోలీస్ ఆధ్వర్యంలో మూడు రోజుల కార్యక్రమం

ముప్పల్, సెప్టెంబర్ 30: (ప్రశ్న ఆయుధం)

మత్తు పదార్థాల వినియోగం రహిత సమాజం నిర్మాణం దిశగా ముప్పల్ పోలీస్ స్టేషన్ ఆధ్వర్యంలో మంగళవారం ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించబడింది. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల వాడకాన్ని నిరోధించేందుకు నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రజలకు మత్తు పదార్థాల వల్ల కలిగే ఆరోగ్యపరమైన, సామాజికపరమైన నష్టాల గురించి వివరంగా తెలియజేశారు.

ఈ అవగాహన కార్యక్రమానికి అనుబంధంగా మోగ్పాల్ మండలంలోని ప్రెసిడెన్సీ పాఠశాల మైదానంలో క్రికెట్ టోర్నమెంట్‌ను ప్రారంభించారు. ఈ టోర్నమెంట్‌కు పీపుల్స్ డెంటల్ కేర్ అధినేత డాక్టర్ మనిష్ రావు ఆర్థిక సహాయం అందించారు. కార్యక్రమంలో పాల్గొన్న ఎస్‌హెచ్‌ఓ సుస్మిత మాట్లాడుతూ, “యువత మత్తు పదార్థాల వైపు ఆకర్షితమవకుండా, క్రీడలవైపు మళ్లేలా ప్రోత్సహించేందుకు ఇలాంటి కార్యక్రమాలు ఎంతో ఉపయోగపడతాయి” అని పేర్కొన్నారు.

డాక్టర్ మనిష్ రావు మాట్లాడుతూ, “ఇలాంటి సేవా కార్యక్రమాల్లో ముందుండి సహకరించడం మా బాధ్యత. యువతలో నెగటివ్ ఆలోచనలు దూరం చేసి, క్రీడలతో ఒత్తిడిని తగ్గించేందుకు ఈవిధమైన టోర్నీలు ఉపయుక్తంగా ఉంటాయి” అని తెలిపారు.

ఈ కార్యక్రమం మూడు రోజులపాటు కొనసాగనుంది. యువత టోర్నమెంట్‌కు భారీగా స్పందించడం హర్షణీయమని నిర్వాహకులు తెలిపారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది, పీపుల్స్ హాస్పిటల్ యాజమాన్యం, స్థానిక పెద్దలు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now