మళ్లీ తెగిపోయిన తిమ్మాపూర్ చెరువు కట్ట – తాత్కాలిక మరమ్మత్తుల్లోనే 10 లక్షల నీటి పాలు

IMG 20251006 WA0093ఎల్లారెడ్డి, అక్టోబర్ 6, (ప్రశ్న ఆయుధం):

తిమ్మాపూర్ గ్రామంలోని పెద్దచెరువు కట్ట ఇటీవల కురిసిన భారీ వర్షాల సమయంలో తెగిపోవడంతో చేపట్టిన చెరువు కట్ట పునరుద్ధరణ పనులు జరుగుతుండగా, అకస్మాత్తుగా నిన్న కురిసిన వర్షంతో తెగిపోయిన చెరువు నీరు పక్కన ఉన్న పొలాలకు చేరి రైతులకు భారీ ఆర్థిక నష్టం కలిగింది.

కాగా ఇటీవల చేపట్టిన తాత్కాలిక మరమ్మత్తులు మాత్రమే సమస్యను పరిష్కరించలేవని స్పష్టమైంది. ప్రతి ఒక్కరికి ఆర్థిక భారం, పంట నష్టం ఏర్పడకూడదని గ్రామ ప్రజలు భావిస్తున్నారు.

గ్రామ ప్రజలు మరియు రైతులు మాట్లాడుతూ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవ తీసుకుని చెరువుకు శాశ్వత కట్ట నిర్మాణం చేపట్టాలని కోరుతున్నారు. తాత్కాలిక చర్యలు కాకుండా శాశ్వత పరిష్కారం తీసుకోవడం మాత్రమే గ్రామ భద్రత, వ్యవసాయ రక్షణ కోసం సురక్షితం అని మాట్లాడారు.

Join WhatsApp

Join Now

Leave a Comment