Site icon PRASHNA AYUDHAM

మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా

IMG 20251007 142652

మహర్షి వాల్మీకి జయంతి వేడుకలు ఘనంగా

బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో కార్యక్రమం

 

కామారెడ్డి జిల్లా ప్రతినిధి 

(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 7 

కామారెడ్డి కలెక్టరేట్ కార్యాలయంలో మంగళవారం బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో మహాకవి వాల్మీకి జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ హాజరై, జిల్లా అదనపు కలెక్టర్ (రెవెన్యూ) విక్టర్, అదనపు కలెక్టర్ (లోకల్ బాడీస్) చందర్‌లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి, మహర్షి వాల్మీకి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, “మహర్షి వాల్మీకి ఆదికవి. ఆయన రచించిన రామాయణం నిత్యనూతనమైన గ్రంథం. ఆయన చూపిన సత్యం, ధర్మం, న్యాయం మార్గం ప్రతి మనిషి జీవితానికి మార్గదర్శకం” అని పేర్కొన్నారు.

కార్యక్రమంలో డీఆర్వో, ట్రైనీ డిప్యూటీ కలెక్టర్ రవితేజ, కలెక్టరేట్ ఏవో, డీఎస్సీడీవో వెంకటేష్, డీఎం‌డబ్ల్యూకు సతీష్ యాదవ్, జిల్లా బీసీ అభివృద్ధి అధికారి జయరాజ్, సహాయ బీసీ అభివృద్ధి అధికారులు చక్రధర్, నరేష్, అశ్వాక్, జీవన్, శాంతయ్య, స్వామి, తిరుమల తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version