ముంపు గ్రామాలలో పర్యటించిన రెవెన్యూ అధికారులు

ముంపు గ్రామాలలో పర్యటించిన రెవెన్యూ అధికారులు

గ్రామాలలో కూలిన ఇండ్లను పరిశీలించి,ఆరోగ్య సూచనలు,ముదస్తు జాగ్రత్తలపై వెల్లడి

ప్రశ్న ఆయుధం న్యూస్ జుక్కల్ నియోజక వర్గం ఆగస్ట్ -31

కామారెడ్డి జిల్లా పిట్లం మండలం లోని కుర్తి,బొల్లాక్ పల్లి గ్రామాలలో ఇటీవల కురిసిన భారీ వర్షాలకు జలదిగ్బంధం లో ఉండిపోయాయి. మండల రెవెన్యూ అధికారులు ఎమ్మార్వో రాజా నరేందర్ గౌడ్,ఆర్ ఐ షీతల్ పర్యవేక్షించి ప్రజల యోగక్షేమలు, కూలిపోయిన ఇండ్ల గురించి ప్రత్యేక్షంగా వీదులలో తిరిగి పరిశీలించారు. ఆరోగ్యం దృష్ట్యా ప్రజలు ఇండ్లలో ఎక్కువ రోజులుగా నీళ్లు నిలువ ఉంచుకోకూడదు, నిలువ ఉన్న నీటిని తాగకూడదు అలాగే కాచి చల్లర్చిన నీటిని తాగాలి ఇంకా రాబోయే వర్షాలు, వరదల పట్ల జాగ్రత్తగా ఉండాలని,కావాల్సిన నిత్యావసర సరుకులను ముందస్తుగ తెచ్చి పెట్టుకోవాలని ప్రజలకు తెలియజేశారు. వరదల వల్ల నీట మునిగిన వరి పొలాలకు ప్రభుత్వం నుండి నష్టపరిహం వచ్చేలా చూడాలని రెవెన్యూ అధికారులకు ప్రజలు వేడుకున్నారు. ఇ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ విజయ,గ్రామ నాయకులు,ప్రభుశెట్టి సంతోష్,మిరియాల అశోక్

గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు..

Join WhatsApp

Join Now

Leave a Comment