మున్సిపాలిటీలో జరిగిన అవినీతిపై చర్యలు తీసుకోవాలికలెక్టర్ కు వినతి పత్రం అందజేసిన అఖిల పక్షం నాయకులు

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 20

కలెక్టరేట్: కొత్తగూడెం మున్సిపాలిటీలో జరుగుతున్న అవినీతి,అక్రమాలపై సమగ్ర విచారణ జరిపించాలని,ఇటీవల నిర్వహించిన, వేసిన అన్ని రకాల టెండర్లను తక్షణమే రద్దు చేసి,మరల టెండర్ ప్రక్రియ నిర్వహించాలని అఖిల పక్ష నాయకులు శనివారం కలెక్టర్ జితేష్.వి.పాటిల్ కు వినతి పత్రం అందజేశారు.ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఎస్సీ రాష్ట్ర కన్వీనర్ జేబీ శౌరి,బీఎస్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యెర్రా కామేష్,సేవ్ కొత్తగూడెం సేవ్ మున్సిపాలిటీ కన్వీనర్ జలాల్ లు మాట్లాడుతూ ఇటీవల నిర్వహించిన టెండర్ ప్రక్రియ లో కనీస నిభందనలు పాటించ లేదని తద్వారా మున్సిపాలిటీకి లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని ఆరోపించారు.మాంసం వ్యర్థాలను రవాణా చేసుకొనుటకు పాల్వంచ మున్సిపాలిటీలో టెండర్ నిర్వహించగా తొమ్మిది నెలలకు రూ.23,05000 ఇరవై మూడు లక్షల ఐదు వేల రూపాయలకు వేలంలో ధక్కించుకున్నారని కొత్తగూడెం మున్సిపాలిటీలో అందుకు భిన్నంగా ఏవిధమైన టెండర్ నిర్వహించకుండా గతంలో టెండర్ నిర్వహిస్తున్న వ్యక్తికి కేవలం రూ.2 లక్షలకు టెండర్ కాలాన్ని సంవత్సరం పొడగించడం మూలంగా ఇరవై లక్షల రూపాయలకు పైగా ఆదాయనికి గండి పడేలా చేశారని ధ్వజమెత్తారు.మున్సిపాలిటీలో నలుగురు వ్యక్తులు సిండికేట్ అయ్యి ఏ నాయకుడు గెలిచినా అతని పంచన చేరి మున్సిపాలిటీ ఆదాయానికి గండి కొడుతున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు.కిన్నెరసాని మంచినీటి కోసం పనులు ప్రారంభం జరిగే వరకు రహదారులు,కాలువలు నిర్మాణం నిలుపుదల చేయాలని కోరారు.ఒకవైపు కిన్నెరసాని మంచినీటి పనులంటూ హడావుడీ చేస్తూ ఇంకోవైపు రోడ్డు నిర్మాణాలు జరిగితే వేసిన రోడ్లను మళ్ళీ తవ్వి పైపు లైన్ వేయడం వల్ల లక్షల రూపాయలు దుర్వినియం అయ్యే అవకాశం ఉందన్నారు.మున్సిపాలిటీలో జరుగుతున్న అనేక అవకతవకలను సమగ్రంగా కలెక్టర్ దృష్టికి తీసుకు వెళ్లడం జరిగిందని వారు అన్నారు.మున్సిపాలిటీ పనితీరుపై సమీక్ష జరపాలని అక్కడ జరుగుతున్న అవినీతి అక్రమాలకు సహకరిస్తున్న అధికారుల పైన చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ను కోరారు.సమస్యలపై సానుకూలంగా స్పందించి టెండర్ రద్దు చేస్తానని హామీ ఇచ్చిన కలెక్టర్ కు అఖిల పక్షం నాయకులు ధన్యవాదాలు తెలిపారు.మున్సిపాలిటీ సమస్యల పరిష్కారం కోసం,అదేవిధంగా జరుగుతున్న అవినీతి,అక్రమాలపై దశల వారి ఆందోళన కార్యక్రమాలు చేపడతామని,సిండికేట్ రాజకీయాలను ప్రజలకు వివరిస్తామని,అవినీతికి పాల్పడుతున్న వారికి భవిష్యత్తులో ప్రజాక్షేత్రంలో బుద్ధి చెబుతామని హెచ్చరించారు.
ఈకార్యక్రమంలో బీఎస్పీ జిల్లా అధ్యక్షులు గంధం మల్లికార్జున రావు,ఆదివాసీ ఐక్య వేదిక రాష్ట్ర కన్వీనర్ వాసం రామకృష్ణ దొర,సిపిఎం పట్టణ నాయకులు వీరన్న,వార్డు కౌన్సిలర్ తంగెళ్ల లక్ష్మణ్,దళిత సంఘల నాయకులు బొమ్మెర శ్రీనివాస్,మురళి* తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now