మెకానిక్ షెడ్ లో షార్ట్ సర్క్యూట్
ప్రశ్న ఆయుధం ఆగస్టు 03: కూకట్‌పల్లి ప్రతినిధి
బాలాజీ నగర్ మోర్ సూపర్ మార్కెట్ ఎదురుగా గల బైక్ మెకానిక్ షెడ్ (ప్రసాద్ షెడ్) షార్ట్ సర్క్యూట్ కారణంగా షాపు మొత్తం దగ్ధం అవటమే కాకుండా అందులో ఉన్న బైకులు ,ఇంజన్లు, బ్యాటరీలు, మరియు వివిధ సామాగ్రి అంతా కూడా పూర్తిగా కాలిపోయిన విషయం తెలుసుకొని కూకట్ పల్లి శాసనసభ్యులు మాధవరం కృష్ణారావు బాలాజీ నగర్ లో గల ప్రసాద్ మెకానిక్ షెడ్ ను పరిశీలించి ఎమ్మార్వో తో మరియు ఇతర అధికారులతో మాట్లాడటం జరిగింది.నిస్స హాయుడై బాధలో ఉన్న ప్రసాద్ ను ఓదార్చి తప్పకుండా ఆర్థిక సహాయం అందేలా చేసి మళ్లీ తన వృత్తిని తిరిగి మొదలు పెట్టేలా చేస్తానని హామీ ఇవ్వడం జరిగింది.
ఈ కార్యక్రమంలో డివిజన్ జనరల్ సెక్రెటరీ వెంకటేష్ చౌదరి , మాజీ కార్పొరేటర్ తూము శ్రవణ్ , సుభాష్ గౌడ్ , అంజి రెడ్డి , సత్యనారాయణ , యువ నాయకులు శ్రీకాంత్, కృష్ణ, వెంకట్, శాంతి, తదితరులు పాల్గొన్నారు.