రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్

రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్న జనసేన నాయకులు: ప్రేమ కుమార్

ప్రశ్న ఆయుధం ఆగస్టు 31: కూకట్‌పల్లి ప్రతినిధి

జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వేడుకలలొ భాగంగా కూకట్‌పల్లి కేపీహెచ్బి రోడ్ నెంబర్-1 కమ్యూనిటీ హాల్ లో మెగా పవర్ ఫ్యాన్స్ ఆధ్వర్యంలో జరిగిన రక్తదాన కార్యక్రమానికి ముఖ్యఅతిధిగా జనసేన పార్టీ ప్రోగ్రామ్స్ కమిటీ చైర్మెన్ కళ్యాణం శివ శ్రీనివాసరావు అలానే జనసేన పార్టీ కూకట్‌పల్లి నియోజకవర్గ ఇన్చార్జి ముమ్మారెడ్డి ప్రేమ కుమార్ హాజరై , యువతలో రక్తదానంపై అవగాహన పెంచుతూ, ఈ రక్తం ద్వారా అనేక ప్రాణాలు రక్షించబడతాయని గుర్తు చేశారు.ప్రేమ కుమార్ మాట్లాడుతూ “పవన్ కళ్యాణ్ పుట్టినరోజును కేవలం వేడుకలకే పరిమితం కాకుండా, సమాజానికి ఉపయోగపడే సేవా కార్యక్రమాల రూపంలో జరపడం చాలా గర్వకారణం. రక్తదానం చేయడం అనేది మానవతా సేవలో ఒక గొప్ప భాగం. జనసేన పార్టీ ఎప్పుడూ ప్రజలతో, ప్రజల కోసం ఉండే పార్టీ” అని చెప్పారు.ఈ కార్యక్రమములో జనసేన పార్టీ నాయకులు, స్థానిక మహిళలు , కార్యకర్తలు మరియు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Join WhatsApp

Join Now

Leave a Comment