సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): భారత స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసా తత్వానికి మార్గదర్శకుడు, జాతిపిత మహాత్మా గాంధీ అని ఎమ్మెల్సీ అంజిరెడ్డి, రామచంద్రపురం కార్పొరేటర్ బూరుగడ్డ పుష్పనగేష్ అన్నారు. గురువారం రామచంద్రపురం శ్రీనివాస్ నగర్ కాలనీ సండే మార్కెట్ వద్ద ఉన్న బాలవిహార్ పార్క్‌లో గాంధీ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నాయకులు ఐలాపూర్ ఐలేష్, మహేందర్ రెడ్డి, చాకలి నరసింహ, మంగలి మానయ్య, కాశాల వీరేశం, సుంకు స్వామి, బైకన్ నవీన్ యాదవ్, మల్లేష్, వెంకటేశ్వర్లు, ఎర్ర హన్మంతు, రమేష్, కృష్ణ, శంకర్, అంజయ్య తదితరులు పాల్గొన్నారు.
రామచంద్రపురం డివిజన్ లో మహాత్మా గాంధీకి నివాళులు
Oplus_131072