రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలకు సిద్ధం
ఎంపిటిసి, జడ్పిటిసి రెండు దఫాలు
సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాలలో : రాష్ట్ర ఎన్నికల అధికారి
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) సెప్టెంబర్ 29
రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు రాష్ట్ర ఎన్నికల సంఘం ఏర్పాట్లు వేగవంతం చేసింది. ఎంపిటిసి, జడ్పిటిసి ఎన్నికలు రెండు దఫాలలో, సర్పంచ్ ఎన్నికలు మూడు దఫాలలో జరగనున్నట్లు రాష్ట్ర ఎన్నికల అధికారి రాణి కుముదిని తెలిపారు. జిల్లా కలెక్టర్లు, ఎన్నికల అధికారులతో ఆమె వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎన్నికల నియమావళి ఉల్లంఘనకు అవకాశం ఇవ్వకూడదని, గ్రామాల్లో రాజకీయ ఫ్లెక్సీలు, వాల్ రైటింగ్స్ తొలగించాలని ఆదేశించారు. పోలింగ్ కేంద్రాల్లో మరమ్మతులు, మౌలిక సదుపాయాలు కల్పించడంతో పాటు మావోయిస్ట్ ప్రభావిత ప్రాంతాల్లో అదనపు పోలీస్ బలగాలను మోహరించాలని సూచించారు. బ్యాలెట్ బాక్సులు, శిక్షణ కార్యక్రమాలు, ఎఫ్ఎస్టీ, ఎస్ఎస్టీ, ఎంసిసి బృందాలు సిద్ధంగా ఉంచాలని తెలిపారు.జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ మాట్లాడుతూ కామారెడ్డి జిల్లాలో రెండు పేజ్‌లలో ఎన్నికలు జరుగనున్నాయని, ఇప్పటికే పిఓలు, ఏఆర్ఓలకు శిక్షణ ఇచ్చామని చెప్పారు. మోడల్ కోడ్ ఆఫ్ కండక్ట్‌ను కఠినంగా అమలు చేస్తూ, జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పారదర్శకంగా ఎన్నికలు జరగేలా చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు.
ఈ సమావేశంలో జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర, అదనపు కలెక్టర్లు, పంచాయతీ అధికారులు, సంబంధిత అధికారులు పాల్గొన్నారు.