Site icon PRASHNA AYUDHAM

దుర్గామాత ఆశీస్సులు అందరిపై ఉండాలి: చిమ్ముల గోవర్ధన్ రెడ్డి

IMG 20251004 184701

Oplus_131072

సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మున్సిపాలిటీ పరిధిలోని దోమడుగులో దుర్గామాత ఊరేగింపు కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సీజీఆర్ ట్రస్ట్ చైర్మన్, బీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు చిమ్ముల గోవర్ధన్ రెడ్డి దుర్గామాతను దర్శించుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. దుర్గామాత ఆశీస్సులు అందరి మీద ఉండాలని, సమాజంలో శాంతి, ఐకమత్యం నెలకొని, అందరి ఇళ్లలో సుఖశాంతులు వెల్లివిరియాలని అన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు మంగయ్య, స్వేచ్చా రెడ్డి, సూర్యనారాయణ, జయపాల్ రెడ్డి, వినోద్ గౌడ్, రాంప్రసాద్, భక్తులు, గ్రామ పెద్దలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

Exit mobile version