సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 1 (ప్రశ్న ఆయుధం న్యూస్):సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలోని కొత్తపల్లి గ్రామానికి చెందిన ఆత్మ కమిటీ చైర్మన్ కొత్తపల్లి శ్రీనివాస్ రెడ్డి రైతు బాధ్యతలతో పాటు ప్రజా సేవా కర్తవ్యాలను సమానంగా నిర్వహిస్తున్నారు. బుధవారం తన టమాట పంట పొలంలో పురుగులు వ్యాపించకుండా ముందస్తు చర్యగా ఆయన ప్రత్యేక స్ప్రే చేశారు. రైతు దైనందిన కృషి పంటను కాపాడటం మాత్రమే కాకుండా, మంచి దిగుబడి సాధించడానికి అత్యవసరం అని ఆయన భావిస్తున్నారు. ఈ సందర్బంగా శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. రైతులు సరైన విధానంలో పంటను సంరక్షిస్తే లాభాలు పొందగలరని, పంటకు పురుగు వ్యాప్తి ఎక్కువైతే రైతులు కష్టపడి వేసిన శ్రమ వృథా అవుతుందని, అందుకే సమయానికి వ్యవసాయ అధికారుల సలహాలు తీసుకోవాలని సూచించారు. తాను రైతుగా మట్టికొద్దీ కృషి చేస్తూనే, ఆత్మ కమిటీ చైర్మన్‌గా రైతుల సమస్యలు, అవసరాలను ప్రభుత్వానికి చేరవేస్తానని హామీ ఇచ్చారు. రైతులను ప్రోత్సహిస్తూ ఆధునిక పద్ధతులు, ఎరువుల వినియోగం, పంట సంరక్షణలో కొత్త సాంకేతికతలు పాటించాలని సలహా పాటించాలని తెలిపారు. రైతు కష్టమే సమాజానికి అండగా నిలుస్తుందని, ప్రతి రైతు తన పంటను సంపదగా భావించి కాపాడుకోవాలని, భవిష్యత్ తరాలకు ఆహార భద్రతను అందించాలని శ్రీనివాస్ రెడ్డి స్పష్టం చేశారు.
రైతులకు ఆదర్శంగా నిలుస్తున్న ఆత్మ కమిటీ చైర్మన్ శ్రీనివాస్ రెడ్డి
Oplus_131072