రైలు నుంచి జారీపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి

*రైలు నుంచి జారీపడి గుర్తు తెలియని వ్యక్తి మృతి..*

*కడియాల కుంట తండా సమీపంలో ఘటన..*

రంగారెడ్డి జిల్లా ఫరూఖ్ నగర్ మండలం పరిధిలో కడియాల కుంట తండా సమీపంలో రైలు నుంచి జారీ పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.సుమారుగా మూడు రోజులుగా క్రితం మరణించి ఉండవచ్చు అని పోలీసులు భవిస్తున్నారు..తండా సమీపంలో దుర్వాసన రావడంతో చూడగా ఓ వ్యక్తి మృతి చెంది ఉన్నాడు. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో సంఘటన స్థలానికి చేరుకుకుని మృతు దేహాని పోస్ట్ మార్టం నిమిత్తం మహబూబ్ నగర్ ప్రభుత్వం ఆస్పత్రికి తరలించారు. మహబూబ్ నగర్ స్టేషన్ మాస్టర్ విష్ణువర్ధన్ పిర్యాదు మేరకు షాద్ నగర్ రైల్వే హెడ్ కానిస్టేబుల్ ఢిల్లీ మల్లేశ్వర్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నాడు. మృతుడు బ్లూ కలర్ జీన్స్, బ్లాక్ కలర్ టీషర్ట్ ధరించాడు.. మృతుడి యొక్క వివరాలు తెలిస్తే షాద్ నగర్ రైల్వే పోలీసులను సంప్రదించండి.. సెల్ : 9848090426..

Join WhatsApp

Join Now