లోయలో పడ్డ ప్రైవేట్ బస్సు ప్రాణనష్టం తప్పింది
కామారెడ్డి బైపాస్ రోడ్ వద్ద ఘటన
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 6
జిల్లాలోని సిరిసిల్ల రోడ్ బైపాస్ వద్ద ఒక ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాదవశాత్తు లోయలో పడిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. నాగపూర్ నుండి హైదరాబాద్ వెళ్తున్న బస్సు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కనే ఉన్న లోయలోకి దూసుకెళ్లింది.
ఇటీవల కురిసిన భారీ వర్షాల కారణంగా రహదారి దెబ్బతినడం, పక్కనే లోయ ఉండడం వల్ల ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది. అదృష్టవశాత్తు ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.