వరద జాగ్రత్తలు పాటించాలి పొదెం వీరయ్య చైర్మన్ తెలంగాణ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ అభివృద్ధి కార్పొరేషన్

వరద జాగ్రత్తలు పాటించాలి

ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రికొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయలపోలయ్య జూలై 20
భద్రాచలం :

 గోదావరి వరదలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో గోదావరి పరివాహక ప్రాంత ప్రజలు తగు జాగ్రత్తలు తీసుకోవాలని, అదేవిధంగా జిల్లా అధికార యంత్రాంగం  వరదలను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని తెలంగాణ రాష్ట్ర ఫారెస్ట్ అభివృద్ధి కార్పొరేషన్ చైర్మన్ శ్రీ పొదెం వీరయ్య పేర్కొన్నారు. 

     భద్రాచలం పట్టణంలోకి వరద నీరు రాకుండా కరకట్ట స్లూయిస్ లను పటిష్టంగా ఉంచాలని,మోటార్లు,ఇసుక బస్తాలను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 

   జిల్లా అధికార యంత్రాంగం గోదారి పరివాహక ప్రాంత ప్రజలను అప్రమత్తంగా ఉంచేలా చర్యలు తీసుకోవాలని కోరారు. నిత్యవసర వస్తువులను అందుబాటులో ఉంచాలన్నారు. అదేవిధంగా ఆయా గోదావరి ప్రభావిత ప్రాంత ప్రజల ఆరోగ్య పరిరక్షణకు వివిధ టాబ్లెట్లను సిద్ధంగా ఉంచుకోవాలని సూచించారు. 

     అత్యవసర పరిస్థితుల్లో అంబులెన్స్ లను కూడా అయప్రాంతాల్లో ఉంచాలని పేర్కొన్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పశువులను గోదావరి దాటించవద్దని, మనుషులు కూడా వాగులు, వంకలు దాటవద్దని, చేపలు పట్టడానికి వెళ్లడం, ఈత కొట్టడం తదితర వాటిని ఆపివేయాలని, గోదావరి పొంగుతున్న నేపథ్యంలో  తగు రక్షణ చర్యలు తీసుకోవాలని కోరారు. 

       ఎంతటి పెద్ద వరదలు వచ్చినా, ప్రజలను అన్ని విధాల ఆదుకోవడానికి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందని ఎవరు కూడా బయోందనులకు గురికావలసిన అవసరం లేదన్నారు


Join WhatsApp

Join Now