సంగారెడ్డి/పటాన్ చెరు, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): విజయాలను చేకూర్చే విజయ దుర్గమ్మ ఈ విజయ దశమి పర్వదినాన ప్రజలందరికీ విజయాలు చేకూర్చాలని మెదక్ పార్లమెంట్ కాంగ్రెస్ పార్టీ కంటెస్టెడ్ క్యాండిడేట్ నీలం మధు ముదిరాజ్ అన్నారు. గురువారం దసరా పండుగ సందర్భంగా తన స్వగ్రామం పటాన్ చెరు నియోజకవర్గం ఇస్నాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని చిట్కుల్ లో జరిగిన దసరా ఉత్సవాల్లో ఆయన గ్రామ ప్రజలతో కలిసి పాల్గొన్నారు. ముందుగా వేణుగోపాల స్వామి ఆలయం నుంచి శావ తీసుకొని వెళ్లి జమ్మి చెట్టుకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. జమ్మి చెట్టుకు పూజలు నిర్వహించిన అనంతరం అందరితో అలయ్ బలాయ్ చేసుకొని దసరా శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తెలంగాణ ప్రజల పెద్ద పండుగ దసరా అని ఆ జగన్మాత దుర్గాదేవి ఆశీస్సులతో ప్రజలందరూ సుఖ సంతోషాలతో ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. దసరా పండుగ రోజు తీసుకునే అలాయి బలాయి ద్వారా పేద ధనిక తారతమ్యం లేకుండా అందరి మధ్య స్నేహపూర్వక వాతావరణం అలవడుతుందని అన్నారు. దసరా ఉత్సవాలను ప్రజలంతా ఆనందోత్సవాల మధ్య జరుపుకోవాలని ఆకాక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, ప్రజలు తదితరులు పాల్గొన్నారు.
విజయాలను చేకూర్చే విజయ దుర్గమ్మ ఆశీస్సులు ప్రజలందరిపై ఉండాలి: నీలం మధు ముదిరాజ్
Oplus_131072