*విద్యార్థులారా దయచేసి ఆ సినిమా చూడండి: బీజేపీ ఎంపీ*
*Apr 20, 2025*
*తెలంగాణ*
ఏప్రిల్ 22వ తేదీన ఇంటర్ ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో విద్యార్థులకు బీజేపీ ఎంపీ ఈటల రాజేందర్ కీలక సూచనలు చేశారు. ఫలితాలు అనుకున్నట్టు రాకపోతే నిరాశచెందవద్దని, ఒక పరీక్ష జీవితాన్ని నిర్ణయించదని అన్నారు. అవకాశాలు ఎన్నో ఉన్నాయని, ’12th ఫెయిల్’ అనే సినిమా ఓటీటీలో ఉంది.. దానిని చూడమని సూచించారు. అపజయం విజయానికి తొలిమెట్టు అని, కుంగిపోకుండా ముందుకు సాగాలని పేర్కొన్నారు.