విద్యార్థుల పట్ల నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదు..
వసతి గృహ విద్యార్థుల పట్ల అశ్రద్ధ వహిస్తే సహించేది లేదని, ప్రభుత్వం వసతి గృహాల విద్యార్థుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుందని, సదుపాయాల విషయంలో ఎలాంటి పొరపాటు జరిగిన చర్యలు తప్పవని పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని ఝాన్సీ రెడ్డి హెచ్చరించారు.వరంగల్ జిల్లా రాయపర్తి మండలం తిరుమలయపల్లి గ్రామంలోని కస్తూర్బా గాంధీ వసతి గృహాన్ని ఎమ్మెల్యే అకస్మితకంగా తనిఖీ చేశారు.
హాస్టల్లోన్ని తరగతి గదుల నిర్వహణ, త్రాగునీటి సౌకర్యం, విద్యార్థులకు అందుతున్న భోజన నాణ్యత గురించి సిబ్బందినీ అడిగి తెలుసుకొన్నారు.పాఠశాలలోని,సదుపాయాల,చెత్త,మరుగుదొడ్ల,నిర్వహణ,సి జనల్ జ్వరాలు,తీసుకోవలసిన జాగ్రత్తల ఫై ఉపాధ్యాయులను అడిగి తెలుసుకొని,విద్యార్థులతో ఆత్మీయంగా పలకరించారు.
పాఠశాల యాజమాన్యం,కొన్ని నిత్యవసర వస్తువులు, కావాలని తెలియపరచగా అందుకు సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ
విద్యార్థులకు నాణ్యతమైన భోజనం అందించాలని సూచించారు ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూసుకోవాలని,విద్యార్థులతో మాట్లాడుతూ వారి సమస్యలు అడిగి తెలుసుకున్నానని, విద్యార్థుల విషయంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు, విద్యార్థుల సమస్యలపై సంబంధిత అధికారులను మందలించారు.సీజనల్ జ్వరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, ప్రతి ఒక్కరూ పరిసరల పరిశుభ్రత పాటించాలన్నారు, తెలంగాణ ప్రజా ప్రభుత్వం వసతి గృహాలకు అధిక ప్రాధాన్శిస్తుందని తెలిపారు.ఈ కార్యక్రమంలో తొర్రూరు బ్లాక్ అధ్యక్షులు హమ్య నాయక్, మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, నియోజకవర్గ నాయకులు గంజి విజయపాల్ రెడ్డి,ప్రిన్సిపాల్ కవిత,ముఖ్య నాయకులు,పాఠశాల యాజమాన్యం, స్థానిక ప్రజలు తదితరులు పాల్గొన్నారు..