విధుల నుంచి డాక్టర్ తొలగింపు: అల్వాల్ పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

విధుల నుంచి డాక్టర్ తొలగింపు: అల్వాల్ పీహెచ్‌సీపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీ

మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లా ప్రశ్నా ఆయుధం ఆగస్టు 30

విధులకు గైర్హాజరు అయినందుకు అల్వాల్ ప్రాథమిక వైద్య కేంద్రం (పీహెచ్‌సీ)లో పనిచేస్తున్న డాక్టర్ శ్వేతను జిల్లా కలెక్టర్ మను చౌదరి ఆదేశాల మేరకు విధుల నుంచి తొలగించారు. ఈ చర్యతో వైద్య వర్గాల్లో ఒక రకమైన కుదుపు నెలకొంది.

జిల్లా కలెక్టర్ మను చౌదరి గత 26వ తేదీన అల్వాల్ పీహెచ్‌సీపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో డాక్టర్ శ్వేత విధులకు హాజరు కాలేదని గమనించారు. ప్రజల ఆరోగ్యానికి సంబంధించిన విషయంలో వైద్యురాలు నిర్లక్ష్యంగా వ్యవహరించడంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. “ప్రజల ఆరోగ్యం విషయంలో నిర్లక్ష్యం అస్సలు సహించం. ప్రభుత్వ ఉద్యోగం అంటే కేవలం జీతం తీసుకోవడం మాత్రమే కాదు, బాధ్యతలను నిర్వర్తించడం తప్పనిసరి” అని కలెక్టర్ హెచ్చరించారు.

దీనిపై తక్షణ చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారిని ఆదేశించగా, ఆదేశాల మేరకు 29వ తేదీన డాక్టర్ శ్వేతను అధికారికంగా విధుల నుంచి తొలగించారు.

ఈ ఘటనపై స్థానికులు కలెక్టర్ జోక్యాన్ని అభినందించారు. ఇలాంటి ఆకస్మిక తనిఖీలు తరచూ నిర్వహించాలని, అప్పుడే సిబ్బంది సమయానికి హాజరై రోగులకు సకాలంలో సేవలు అందిస్తారని వ్యాఖ్యానించారు.

Join WhatsApp

Join Now

Leave a Comment