వినాయక నగర్ కాలనీలో బతుకమ్మ సంబరాలు ఘనంగా
ప్రశ్న ఆయుధం,కామారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 29:
కామారెడ్డి వినాయక నగర్ కాలనీ బతుకమ్మ సంబరాలతో సందడిగా మారింది. తొమ్మిదిరోజుల పూల పండుగలో భాగంగా ఆదివారం నిర్వహించిన ఉత్సవంలో మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బతుకమ్మలు ఆడుతూ సాంప్రదాయ గానాలతో కాలనీని కిక్కిరిసేలా తీర్చిదిద్దారు.
ప్రతి సంవత్సరం ఆనవాయితీగా జరుపుకునే ఈ ఉత్సవం, ఈసారి మరింత వైభవంగా సాగింది. బతుకమ్మ చుట్టూ గుమిగూడిన మహిళలు పూలతో చేసిన కళాత్మక అలంకరణలతో తమ భక్తి, సృజనాత్మకతను ప్రతిబింబించారు.
ఈ కార్యక్రమంలో కాలనీ అధ్యక్షుడు చింతల లింగం, కోశాధికారి సునీల్ కుమార్, రాజు శ్రీనివాస్, రంజిత్ రెడ్డి, తిరుపతిరెడ్డి, అడ్వకేట్ తిరుపతి, ప్రవీణ్, శ్రీనివాస్ రెడ్డి, లక్ష్మణ్, రామకృష్ణ, నరసయ్య, కమలాకర్ రెడ్డి, సోలార్ రమేష్, దత్తు, లక్ష్మీరాజ్యం, మహేష్, భాను, వెంకటేశం, ఆకుల సంజీవ్, కే. శ్రీనివాస్, విజయపాల్ రెడ్డి, నరసింహారెడ్డి, భూమేష్ యాదవ్, సబ్బని ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు.
కుటుంబ సమేతంగా కలసికట్టుగా జరుపుకున్న ఈ పూల పండుగలో కాలనీ ఐక్యత ప్రతిబింబించిందని వాసులు ఆనందం వ్యక్తం చేశారు.