శట్పల్లి లో ఉద్యోగ విద్యావంతుల దాత్రృత్వం- విద్యార్థులకు యూనిఫాంలు, బెంచీలు అందజేత

లింగంపేట్, అక్టోబర్ 1, (ప్రశ్న ఆయుధం):

గ్రామాభివృద్ధి, విద్యార్థుల భవిష్యత్తు కోసం ఎల్లప్పుడూ ముందుండే లింగంపేట్ మండలం శట్పల్లి గ్రామ ఉద్యోగ విద్యావంతుల వేదిక మరోసారి స్ఫూర్తిదాయకమైన కార్యక్రమాన్ని చేపట్టింది. ప్రతి సంవత్సరం విద్యార్థుల కోసం వివిధ రకాల సహాయాలు అందిస్తున్న ఈ వేదిక, ఈసారి ప్రాథమిక పాఠశాల విద్యార్థులకు సుమారు లక్ష రూపాయల విలువ గల బెంచీలు, యూనిఫాంలను సమకూర్చి అందజేసింది.

విద్యార్థుల పాఠశాల వాతావరణం మెరుగుపరచడం, వారికి చదువులో సౌకర్యాన్ని కల్పించడం లక్ష్యంగా ఈ సహాయం అందించబడింది. గ్రామానికి చెందిన ఉద్యోగ విద్యావంతులు తమ తమ వంతుగా ఆర్థిక సహకారం అందించి సమిష్టిగా ఈ సదుపాయాలను సమకూర్చడం విశేషం.

ఈ కార్యక్రమంలో ప్రాథమిక పాఠశాల హెడ్మాస్టర్ శ్యామల, ఉపాధ్యాయులు అనురాధ, రాములు, సర్దార్ పాల్గొన్నారు. సీనియర్ ఉద్యోగులు అట్టెం పర్వయ్య, ఆముదాల భానుశంకర్, అట్టెం రాములు, ముత్తి బాలయ్య, బొడ్డు బల్రాజు, పిల్లి భాషయ్య, పిల్లి శివరాములు, కుమ్మరి కృష్ణమూర్తి, బందరబోయిన సత్యనారాయణ, బందరబోయిన రమేష్, బందరబోయిన అజయ్,ఆదిరెడ్డి, పిల్లి సురేష్ తదితరులు హాజరై విద్యార్థులను ఉత్సాహపరిచారు.

గ్రామ పెద్దలు మాట్లాడుతూ, “విద్యార్థుల అభ్యున్నతి కోసం ఉద్యోగ విద్యావంతుల వేదిక చేస్తున్న ఈ కృషి చాలా గొప్పది. ఈ తరహా సహకారాలు గ్రామ విద్యా రంగానికి భరోసా కలిగిస్తాయి” అని అభిప్రాయపడ్డారు.

Join WhatsApp

Join Now