సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): దేశ స్వాతంత్ర్య సమరయోధుడు, అహింసామూర్తి మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని గురువారం సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గాంధీజీ చిత్రపటానికి కలెక్టరేట్ అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఏవో అంథోని, సూపరింటెండెంట్ విజయలక్ష్మి మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ గాంధీ సిద్ధాంతాలను ఆచరించి, సమాజంలో శాంతి, ఐక్యత నెలకొల్పే దిశగా కృషి చేయాలని అన్నారు. గాంధీజీ బోధనలు దేశానికి మాత్రమే కాకుండా ప్రపంచానికే స్ఫూర్తిదాయకమని, ఆయన చూపిన దారి ఎల్లప్పుడూ మానవాళిని సన్మార్గంలో నడిపిస్తుందని అన్నారు. ఈ కార్యక్రమంలో అధికారులు, ఉద్యోగులు పాల్గొన్నారు.
సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయంలో గాంధీ జయంతి వేడుకలు
Oplus_131072