సంగారెడ్డి ప్రతినిధి, అక్టోబర్ 2 (ప్రశ్న ఆయుధం న్యూస్): జాతిపితా – మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకొని, సంగారెడ్డి జిల్లా పోలీసు కార్యాలయంలో గాంధీజీ చిత్రపటానికి జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. భారత స్వాతంత్ర్య ఉద్యమ నాయకుడు, అహింసా సిద్ధాంతానికి మార్గదర్శకుడు మహాత్మా గాంధీ అని, ఆయన సత్యం, అహింస, సామరస్యంతో కూడిన తత్వాలు నేటి తరానికి కూడా మార్గదర్శకాలు అని, మనమంతా గాంధీ సిద్ధాంతాలను ఆచరిస్తే సమాజంలో శాంతి, ఐకమత్యం మరింత బలపడుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ రమేష్, ఆర్ఐ. డానియెల్, వివిధ సెక్షన్లకు చెందిన డీపీఓ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.