సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 29 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డిలోని బాలసధనంలో మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బాలసధనంలోని ఆడపిల్లలు ఉత్సాహంగా పాల్గొని ఆటపాటలతో బతుకమ్మ చుట్టూ నృత్యం చేస్తూ సంబరాలు జరిపారు. తెలంగాణ సాంప్రదాయ పండుగ అయిన బతుకమ్మను చిన్నారులు ఎంతో ఉత్సాహంతో జరుపుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా మహిళా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ.. బతుకమ్మ పండుగ మహిళల ప్రత్యేక పండుగ అని, సాంస్కృతిక వైభవానికి ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు. పిల్లలకు చిన్న వయస్సులోనే మన సాంప్రదాయాలను పరిచయం చేయడం ఎంతో ముఖ్యమని, అలా చేస్తే వారిలో సంస్కృతి పట్ల గౌరవభావం పెంపొందుతుందని ఆమె తెలిపారు. ఈ కార్యక్రమంలో డీసీపీవో రత్నం, సూపరిండెంట్ విజయకుమారి, రజిత, సీనియర్ అసిస్టెంట్ సంజీవ్, హేమంత్, ఎఫ్ఆర్ఓ సతీష్, మహిళా శిశు సంక్షేమ శాఖ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
సంగారెడ్డి బాలసధనంలో ఘనంగా బతుకమ్మ సంబురాలు
Oplus_131072