ప్రశ్న ఆయుధం న్యూస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రతినిధి రాయల పోలయ్య జూలై 20
ఏజెన్సీ ప్రాంతంలో 1997 సమత జడ్జిమెంట్ ను అమలు చేయాలని చట్టం చెపుతున్నా పట్టింపులేని సింగరేణి అధికారులు
సుప్రీం కోర్టు ఆర్డర్ ప్రకారం ఆదివాసీలకే ఉద్యోగ ఉపాధి ఇవ్వాలి
- సుప్రీం కోర్టు తీర్పు కు వ్యతిరేకంగా నియామకాలు జరిగితే సంబంధిత సింగరేణి అధికారులపై కోర్టులో కేసులు నమోదు చేపిస్తామన్న ఆదివాసీ జేఏసీ*
భద్రాద్రి కొత్తగూడెం,
మణుగూరు సింగరేణి స్కూల్లో అవుట్ సోర్సింగ్ ఉద్యోగ నియామకాలు సుప్రీంకోర్టు ఆర్డర్ ప్రకారం గా స్థానిక ఆదివాసీలకు, ల్యాండ్ లూజర్స్ కి మాత్రమే ఇవ్వాలని ఆదేశాలు ఉన్నాయి. సమత జడ్జిమెంట్ (1997) చట్ట ప్రకారం అమలు చేస్తూ ఆదివాసీలకు, ల్యాండ్ లోజర్ లకు మాత్రమే అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలు, పర్మినెంట్ ఉద్యోగాలు ఇవ్వాలని చట్టం చెబుతున్న స్థానిక సింగరేణి అధికారులు మాత్రం ఏ చట్టాలను పట్టించుకోకుండా.. వారికి నచ్చినట్లుగా ఉద్యోగాలను అమ్ముకుంటున్నారని, గతంలో (12-07-2024) న డెమో ఇంటర్వ్యూలో కేవలం దొడ్డిదారిన సెటిల్మెంట్ చేసుకున్న అభ్యర్థులకు మాత్రమే డెమో నిర్వహించడం జరిగిందని, ఆరోపణలు వెల్లువెత్తగా.. జిల్లా యంత్రాంగం జ్యోక్యం చేసుకోవడంతో.. నిర్వహించిన డెమో లను రద్దు చేశారు. కానీ అధికారం హోదా ఉన్నంతసేపు బుద్ధి మరదన్నట్లుగా.. మళ్ళీ వారి అభ్యర్థులకే ఇవ్వడం కోసం రహస్య చర్చలు జరుపుతూ.. ఆదివాసీలకు మొండిచెయ్యి చూపిస్తున్నారని ఆదివాసీ నిరుద్యోగులు ఆవేదన చెందుతున్నారు. అందుచేతనే నాడు సెలెక్టెడ్ అభ్యర్థుల వివరాలు రహస్యంగా ఉంచారని పలువురు చర్చించుకుంటున్నారు. ఈ విధముగా డబ్బుకు అమ్ముకుంటే విద్యార్థుల చదువులు ప్రశ్నార్థకమే.! మళ్ళీ ఆ ఇద్దరి సమక్షంలోనే డేమోలు నిర్వహిస్తే.. విద్యార్థుల భవిష్యత్తు నాశనం అవుతుందని, ఆ ఇద్దరి ప్రమేయం లేకుండా.. ఇతర సింగరేణి ఉన్నత స్థాయి అధికారుల సమక్షంలో.. సమత జడ్జిమెంట్ ప్రకారం నిర్వహించాలని, ఏజెన్సీ చట్టాలకు అనర్హులైనటువంటి గిరిజననేతరుల దరఖాస్తులు స్వీకరించకూడదని మణుగూరు ఆదివాసీ జేఏసీ తరపున సింగరేణి ఎస్.ఓ. టు జి. ఎం. కు దరఖాస్తు ఇవ్వడంమైనది. చట్ట ప్రకారం అమలు చేయని పక్షాన సంబంధిత సింగరేణి అధికారులపై కోర్టు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా మణుగూరు ఆదివాసీ జేఏసీ అధ్యక్షుడు సోడే రవికుమార్ దొర, ఉపాధ్యక్షులు పూనెం రమేష్ దొర, గనిబోయిన ముత్తయ్య, సెక్రెటరీ పూనెం నాగరాజు, శ్రీను తదితరులు హాజరవ్వడంమైనది.