సంగారెడ్డి ప్రతినిధి, సెప్టెంబర్ 30 (ప్రశ్న ఆయుధం న్యూస్): దుర్గాష్టమి పర్వదినాన్ని పురస్కరించుకొని జిల్లా సాయుధ పోలీస్ కార్యాలయంలో ఆయుధ పూజ, మోటర్ వెహికల్ సెక్షన్ లో వాహనాలకు జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో శాంతి భద్రతల పరిరక్షించడంలో, నేరాలను నియంత్రించడంలో జిల్లా పోలీసులు సఫలీకృతం అవ్వాలని, రానున్న స్థానిక ఎన్నికలను శాంతియుత వాతావరణంలో నిర్వహించుకొనేలా దుర్గామాత కరుణా, కటాక్షాలు జిల్లా పోలీసులకు ఎల్లవేళలా ఉండాలని ఆకాంక్షిస్తూ పూజలు నిర్వహించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమానికి సంగారెడ్డి అదనపు ఎస్పీ రఘునందన్ రావు, డీఎస్పీ సత్యయ్య గౌడ్, ఏ.ఆర్.డీఎస్పీ నరేందర్, ఆర్.ఐ.లు రామరావు, రాజశేఖర్ రెడ్డి, శ్రీనివాస్ రావ్, డానియెల్ ఇన్స్పెక్టర్ రమేష్ ఏ.ఆర్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.