సీఎంఆర్ మిల్లర్లు గడువులోపు బకాయిలు పూర్తి చేయాలి
రోజువారీ టార్గెట్ సాధనపై కలెక్టర్ ఆదేశాలు
కామారెడ్డి జిల్లా ప్రతినిధి
(ప్రశ్న ఆయుధం) అక్టోబర్ 6
జిల్లా కలెక్టర్ ఆశీష్ సాంగ్వాన్ సోమవారం కలెక్టరేట్‌లోని ఐడీఓసీ సమావేశ మందిరంలో సీఎంఆర్ రైస్ మిల్లర్లతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఖరీఫ్ 2024–25 సీజన్‌లో బకాయిలు ఉన్న మిల్లర్లు నవంబర్ 12, 2025 లోపు సీఎంఆర్ పూర్తి చేయాలని ఆదేశించారు. మిల్లర్లు రోజువారీ లక్ష్యాలను తప్పనిసరిగా పూర్తి చేయాలని, ప్రతి మిల్లును ఎన్ఫోర్స్మెంట్ అధికారులు ప్రత్యక్షంగా పరిశీలించాలని సూచించారు.అలాగే, ప్రస్తుతం ప్రారంభమైన ఖరీఫ్ 2025–26 సీజన్‌కు సంబంధించిన ధాన్యం సేకరణలో, మిల్లులకు కేటాయించిన ధాన్యాన్ని దిగగానే వెంటనే ట్రక్ చిట్‌ను పీపీసీ సెంటర్ ఇంచార్జీలకు అందించి, మిల్లర్లు ఆ రసీదును అంగీకరించాలన్నారు. దీనివల్ల రైతులకు చెల్లింపులు త్వరగా ఖాతాల్లో జమ అవుతాయని తెలిపారు.ఈ సమీక్ష సమావేశంలో జిల్లా పౌర సరఫరాల అధికారి, ఎఫ్‌సీఐ డిపో మేనేజర్ (నిజామాబాద్), జిల్లా సివిల్ సప్లై అధికారి మరియు జిల్లా పౌర సరఫరాల సంస్థ మేనేజర్ పాల్గొన్నారు.