Site icon PRASHNA AYUDHAM

సెప్టెంబర్ 9న చలో పరేడ్ గ్రౌండ్ విజయవంతం చేయండి 

IMG 20250824 WA0032

సెప్టెంబర్ 9న చలో పరేడ్ గ్రౌండ్ విజయవంతం చేయండి

వికలాంగుల చేయూత పెన్షన్దారుల మహా గర్జన సభని విజయవంతం చేయండి

సిద్దిపేట జిల్లా ఇన్చార్జి మంద కుమార్ మాదిగ

గజ్వేల్ ప్రశ్న ఆయుధం 24

సెప్టెంబర్ 9 న చలో పరేడ్ గ్రౌండ్ వికలాంగుల మరియు చేయూత పెన్షన్ దారుల “మహా గర్జన” సభ ను విజయవంతం చేయాలని సిద్దిపేట ఎమ్మార్పీఎస్ జిల్లా ఇన్చార్జి మంద కుమార్ మాదిగ అన్నారు. పద్మశ్రీ మంద కృష్ణ మాదిగ ఆదేశాల మేరకు వి హెచ్ పి ఎస్ (వికలాంగుల హక్కుల పోరాట సమితి) సిహెచ్పిఎస్ (చేయూత పెన్షన్ దారుల హక్కుల పోరాట సమితి) గజ్వేల్ నియోజకవర్గం గజ్వేల్ ప్రజ్ఞాపూర్ మున్సిపాలిటీ పరిదిలో క్యాసారం గ్రామంలో సమావేశం ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నేత మైస రాములు మాదిగ అధ్యక్షతన జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా సిద్దిపేట జిల్లా ఇంచార్జ్ మంద కుమార్ మాదిగ విచ్చేసి మాట్లాడుతూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల సమయంలో ఇచ్చిన మాట ప్రకారం (చేయూత) ఆసరా పెన్షన్ దారులకు రూ:2000 నుండి రూ: 4000 వరకు, వికలాంగులకు రూ: 4000 నుండి రూ: 6000 వరకు, మరియు కండరాల క్షీణించిన వారికి రూ: 15000 రూపాయలు పెంచి ఇవ్వాలని కొత్తగా పెన్షన్ దరఖాస్తు చేసుకున్న వారికి వెంటనే మంజూరు చెయ్యాలి లేకుంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 45 లక్షల ఆసరా పెన్షన్ దారులు రాష్ట్ర ప్రభుత్వంపై తిరుగుబాటు చేస్తారని చెప్పడం జరిగింది. ఈ కార్యక్రమంలో వికలాంగుల, చేయూత పెన్షన్ దారులు కప్ప యాదగిరి, వంటేరు చంద్రారెడ్డి, వడ్డారం యాదమ్మ, బీడీ కార్మికురాలు కుమ్మరి లక్ష్మీ, నర్సవ్వ, దాసరి కవిత, కడారి గంగమ్మ, వడ్డారం ఎల్లయ్య వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, మరియు వికలాంగులు తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version