స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ లపై అపోహల నివారణ

స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ లపై అపోహల నివారణ

రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం

మండల పరిషత్ అభివృద్ధి అధికారి టి విజయ్ కుమార్

జమ్మికుంట ఆగస్టు 30 ప్రశ్న ఆయుధం

త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఓటర్ లిస్ట్ వార్డుల వారిగా ముద్రించడం జరిగిందని వాటిపై ఏమైనా అపోహలు ఉన్నట్లయితే తెలుపాలని జమ్మికుంట మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో ఎంపీడీవో టి విజయ్ కుమార్ కోరారు రాజకీయ పార్టీల ప్రతినిధులు మాట్లాడుతూ ఒక కుటుంబం ఒకే వార్డులో వచ్చే విధంగా చూడాలని 18 సంవత్సరాలు నిండిన ప్రతి పౌరునికి ఓటు హక్కు కల్పించాలని స్థానికంగా లేకుండా, మరణించిన ఓటర్లను ఓటర్ లిస్ట్ నుండి తొలగించాలని కోరారు అనంతరం ఎంపీడీవో విజయ్ కుమార్ మాట్లాడుతూ గ్రామాలలో ఓటర్ లిస్ట్ లో ఏమైనా తప్పిదాలు దొరినట్లయితే గ్రామపంచాయతీ కార్యదర్శి సంప్రదించి సరి చేసుకోవాలని సూచించారు ఇట్టి సమావేశం నందు బి.ఆర్.ఎస్. పార్టీ మండల అధ్యక్షుడు పింగిలి రమేష్ కాంగ్రెస్ పార్టీ తరపున దుర్గల భాస్కర్ బి.ఎస్.పి పార్టీ మండల అధ్యక్షుడు దాసారపు మహేందర్ సిపిఐ పార్టీ మండల అధ్యక్షుడు గజ్జి ఐలయ్య సిపిఎం పార్టీ మండల అధ్యక్షుడు శీలం అశోక్ సమావేశానికి హాజరైనారు

Join WhatsApp

Join Now

Leave a Comment