Site icon PRASHNA AYUDHAM

స్విమ్మింగ్ కోచ్ ను నియమించాలని డీవైఎస్ఓ ఖాసిం బేగ్ కు వినతి పత్రం

IMG 20251007 183353

Oplus_131072

సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 7 (ప్రశ్న ఆయుధం న్యూస్): సంగారెడ్డి పట్టణ కేంద్రంలోని సిమ్మింగ్ ఫుల్ లో సిమ్మింగ్ కోచ్ లేక స్విమర్స్ ఇబ్బందులకు గురవుతున్నారని మంగళవారం సంగారెడ్డి జిల్లా కలెక్టరేట్ డీఎస్ఏ కార్యాలయంలో డీవైఎస్ఓ ఖాసిం బేగ్ కు పేరెంట్స్ వినతి పత్రం అందజేశారు. రాజీవ్ పార్క్ పక్కన గల స్విమ్మింగ్ పూల్ లో ప్రతి రోజూ అనేక మంది విద్యార్థులు, యువకులు ఈత నేర్చుకోవడానికి వస్తుంటారని, ప్రస్తుతం శిక్షణ ఇచ్చే కోచ్ లేకపోవడంతో వారికి సరైన మార్గదర్శకత్వం అందడం లేదని పేరెంట్స్ ఆవేదన వ్యక్తం చేశారు. స్విమ్మింగ్ క్రీడలో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్న స్విమర్స్ ఇక్కడ ప్రతిరోజు ప్రాక్టీస్ చేస్తున్నారని, భవిష్యత్తులో ఉన్నత స్థాయికి చేరుకోవాలంటే అనుభవజ్ఞుడైన కోచ్ అవసరమని అన్నారు. ఈ నేపథ్యంలో వెంటనే అర్హత కలిగిన స్విమ్మింగ్ కోచ్ ను నియమించి, క్రీడాకారుల భవిష్యత్తుకు ఉపయోగపడేలా వెంటనే చర్యలు తీసుకోవాలని డి.వై.ఎస్.ఓ ఖాసిం బేగ్ ను కోరారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి తీసుకుని వెంటనే నియమించే విధంగా చర్యలు తీసుకుంటామని ఖాసిం బేగ్ సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో ‌పేరెంట్స్ మహమ్మద్ సిద్ధీఖ్, మహమ్మద్ పర్వేజ్, పంతులు హరిశర్మ, మసూద్ ఇంతియాజ్ అహ్మద్ ఖాన్, అజయ్, సంతోష్, మహమ్మద్ అఫ్రోజ్ తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version