సంగారెడ్డి జిల్లా ప్రతినిధి, అక్టోబర్ 4 (ప్రశ్న ఆయుధం న్యూస్): మాజీ మంత్రి హరీష్ రావుకు సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మర్యాద పూర్వకంగా కలిసి దసరా శుభాకాంక్షలు తెలిపారు. శనివారం హైదరాబాద్ లోని హరీష్ రావు నివాసం వద్ద నియోజకవర్గ బీఆర్ఎస్ శ్రేణులతో కలిసి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ హరీష్ రావుకు దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో టీ ఎన్ జీఓ ఎస్ రాష్ట్ర మాజీ అధ్యక్షుడు రాజేందర్, మాజీ సీడీసీ చైర్మన్ కసాల బుచ్చిరెడ్డి, మాజీ గ్రంథాలయ సంస్థ చైర్మన్ నరహరిరెడ్డి, మాజీ జడ్పీటీసీ కొండల్ రెడ్డి, మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ సుధీర్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి, చక్రపాణి, మాజీ ఆత్మ కమిటీ చైర్మన్ కృష్ణ గౌడ్, శంకర్ గౌడ్, ఇంద్రారెడ్డి, నాయకులు తదితరులు ఉన్నారు.