కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 07 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష మరియు 10 వేల జరిమానా 

కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన నేరస్తునికి 07 సంవత్సరాల కఠిన కారాగార జైలు శిక్ష మరియు 10 వేల జరిమానా

ప్రశ్న ఆయుధం కామారెడ్డి :

నేరం చేసిన నేరస్తులకు శిక్షలు పడ్డప్పుడే బాధితులకు సరైన న్యాయం జరిగినట్లు

నేరం చేసిన నేరస్తులు చట్టం నుండి తప్పించుకోలేరు

జిల్లా ఎస్పీ సింధుశర్మ ఐపిఎస్ వెల్లడించారు.కన్న కూతురిపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో (పోక్సో) నేరస్తుడు అయిన జేర్రీపోతుల దేవరాజు, 41 సం,, గల వ్యక్తికి 07 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ కామారెడ్డి మొదటి అదనపు.జిల్లా జడ్జి లాల్ సింగ్ శ్రీనివాస్ నాయక్

బుధవారం తీర్పు చెప్పారు.

బీబీపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని ఒక గ్రామానికి చెందిన 15 ఏళ్ల మైనర్ బాలికను 2024 జనవరి 14న ఇంటి బయట అడుకుంటున్న కూతురిని ఇంట్లో ఎవరు లేరని తండ్రి అయిన జేర్రీపోతుల దేవరాజు ఇంట్లోకి పిలిచి కూతురిపై లైంగిక దాడికి పాల్పడటంతో అమె ఏడుస్తూ తీవ్ర భయాందోళనకు గురై తన తల్లి బీబీపేట మార్కెట్ వెళ్లి ఇంటికి రాగానే తల్లికి జరిగిన విషయాన్ని చెప్పడంతో 2024 జనవరి 15న స్ధానిక బీబీపేట పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు.

పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి సాక్షులను విచారించి, నేరస్తుడిని అరెస్ట్ చేసి అన్ని సాక్షాదారాలను సేకరించి కోర్టులో అభియోగపత్రం దాఖలు చేశారు. కేసు పూర్వాపరాలు, సాక్ష్యాధారాలు, వైద్య నివేదికను పరిశీలించిన న్యాయ మూర్తి నిందితుడిపై మోపిన నేరం రుజువు అయిందని 07 సంవత్సరాల కఠిన కారాగార శిక్ష, రూ.10 వేలు జరిమానా విధించడం జరిగింది.

ఈ కేసును సరియగు పద్దతిలో విచారణ చేసిన అప్పటి డిఎస్పిలు శ్రీనివాసులు (ప్రస్తుత ఎల్లారెడ్డి డిఎస్పి), ఆర్. ప్రకాష్, నాగేశ్వర రావు, అప్పటి సిఐ తిరుపయ్య, ఎస్ఐ యస్. అనిల్, పోలీసు తరపున వాదనలు వినిపించిన స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ శేషు కోర్టులో సాక్షులను ప్రవేశపెట్టిన ప్రస్తుత కామారెడ్డి ఎఎస్పీ చైతన్య రెడ్డి ఐపిఎస్ ప్రస్తుత సిఐ సంపత్ కుమార్, ఎస్ఐ ప్రభాకర్, కోర్టు లైజనింగ్ ఆఫీసర్ ఎస్‌ఐ టి. మురళి, కోర్ట్ కానిస్టేబుల్ ప్రమోద్ రెడ్డి, ప్రవీణ్ లను జిల్లా ఎస్పీ. అభినందించారు.

Join WhatsApp

Join Now