తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి ఆధ్వర్యంలో కామారెడ్డి జిల్లా కేంద్రంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర ఉపాధ్యక్షులు చిన్నోళ్ల భాస్కర్ జిల్లా అధ్యక్షుడు జువ్వాడి శ్రీకాంత్ లు మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర రజకుల యొక్క ఆర్థిక స్థితిగతులను దృష్టిలో ఉంచుకొని రజక సమాజాన్ని ఆర్థికంగా బలోపేతం అయ్యే విధంగా ప్రతీ రజక కుటుంబానికి 10 లక్షల ఆర్థిక సహాయంతో రజక బంధు ఇవ్వాలని కామారెడ్డి జిల్లా నుండి తెలంగాణ రజక రిజర్వేషన్ సమితి డిమాండ్ చేస్తుంది ఈ కార్యక్రమంలో జిల్లా యూత్ ప్రధాన కార్యదర్శి రాచమల్లు రాజశేఖర్, అనిల్, రవి, బాలు తదితరులు పాల్గొన్నారు..