Site icon PRASHNA AYUDHAM

100కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు దంపతులకు అందజేత

IMG 20250420 WA2253

*100కిలోల ముత్యాల తలంబ్రాలు రామకోటి రామరాజు దంపతులకు అందజేత*

*★ ఘనంగా సన్మానించిన భద్రాచల దేవస్థాన AEO శ్రావణ్ కుమార్*

*★ రామకోటి రామరాజు కృషి, పట్టుదల అమోఘం అని కొనియాడారు*

*★ అపర రామభక్తికి మెచ్చి ముత్యాల హారం బాహుకరణ.*

*★ గ్రామ, గ్రామాన రామభక్తిని నింపడం ఓ అద్భుత ఘట్టం*

*★ గోటి తలంబ్రాల్లో పాల్గొన్న భక్తులకు అందజేస్థా: రామకోటి రామరాజు*

ప్రశ్న ఆయుధం

రామనామమే ప్రాణమని సిద్దిపేట జిల్లా గజ్వేల్ పట్టణంలోని శ్రీరామకోటి భక్త సమాజం సంస్థ ఆధ్వర్యంలో భద్రాచల సీతారాముల కల్యానానికి ప్రతి సంవత్సరం గోటి తలంబ్రాలు అందిస్తున్నది. ఈ సంవత్సరం 250కిలోలు అందించారు.

భద్రాచల దేవస్థానం ఏఈఓ శ్రావణ్ కుమార్ ఆదివారం నాడు శ్రీరామకోటి భక్త సమాజం వ్యవస్థాపక, అధ్యక్షులు రామకోటి రామరాజు దంపతులచె ప్రత్యేక పూజలు జరిపి శాలువాతో ఘనంగా సన్మానించి 100కిలోల ముత్యాల తలంబ్రాలు అందజేశారు. రామకోటి రామరాజు నిశ్వార్థ అపర రామభక్తికి మెచ్చి ముత్యాల హారాన్ని కూడా అందజేశారు.

ఈ సందర్బంగా మాట్లాడుతూ ఆణువణున రామనామాన్ని నింపుకొని తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా గ్రామ, గ్రామాన తిరిగి వడ్లను గోటితో ఓలిపించి ప్రతి సంవత్సరం భక్తితో కళ్యానానికి అందిచడం రామకోటి రామరాజు రామభక్తి ఎంత గొప్పదో మాటలో చెప్పలేనిది అని కొనియాడారు. గత 26 సంవత్సరాలనుండి రామకోటి ప్రతి భక్తునిచే లిఖింపజేపిచ్చి జీవితాన్నే రామునికి అంకితం చేసి అపర రామదాసుగా చరిత్రలో నిలిచిపోయాడన్నారు. ఈయన సేవలను అమోఘమని అపర రామదాసుగా గతంలోనే కీర్తించమని తెలిపారు. 20కిలోలు ఒకసారి, 150కిలోలు మరోసారి, 250కిలోలు ఈసారి ఇవ్వడం కృషి, పట్టుదల ఉన్న రామకోటి రామరాజుకే సాధ్యం అన్నారు.

రామకోటి రామరాజు మాట్లాడుతూ త్వరలో భక్తులందరికి తలంబ్రాలు అందజెస్తానన్నారు.

Exit mobile version