బిజెపిలో వందమందిని సభ్యులుగా చేర్చిన వారు క్రియాశీల సభ్యులు

బీజేపీలో వంద మందిని సభ్యులుగా చేర్చినవారు క్రియాశీల సభ్యులుగా అర్హులు

100 రూపాయలు ఆన్ లైన్ లో చెల్లించి క్రియాశీల సభ్యులుగా చేరాలి*

కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి*

*మండలానికి 100 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలి*

*పార్టీలో బూత్ అద్యక్షుడు నుండి జాతీయ అధ్యక్షుడు వరకు అందరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలి*

బీజేపీ సభ్యత్వ ప్రభారి ఆలే భాస్కర్*

ప్రశ్న ఆయుధం న్యూస్, అక్టోబర్ 29, కామారెడ్డి :

కామారెడ్డి జిల్లా బీజేపీ కార్యాలయంలో బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార అధ్యక్షతన మంగళవారం బీజేపీ క్రియాశీల సభ్యత్వ కార్యాశాల నిర్వహించారు.

ఈ సందర్భంగా కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి మాట్లాడుతూ సెప్టెంబర్ 2 వ తేదిన ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించిన సభ్యత్వ నమోదు కార్యక్రమం గత 2 నెలలుగా నిర్విరామంగా కొనసాగిదని నేటి నుండి జిల్లా స్థాయిలో క్రియాశిల సభ్యత్వం చేపట్టాలని , 100 మందిని బీజేపీ లో సభ్యులుగా చేర్చిన వారు క్రియాశీల సభ్యులుగా అర్హులనీ అన్నారు. 100 మందిని సభ్యులుగా చేర్చిన వారు 100 రూపాయలు ఆన్ లైన్ లో నమో ఆప్ లో చెల్లించి క్రియాశీల సభ్యులుగా చేరాలనీ బీజేపీ జిల్లా అధ్యక్షురాలు క్రియాశీల సభ్యత్వం అందజేస్తుందని అన్నారు.

ఈ సందర్భంగా బీజేపీ జిల్లా సభ్యత్వం ప్రభారీ ఆలే భాస్కర్ మాట్లాడుతూ జిల్లాలో మండలానికి 100 మంది క్రియాశీల సభ్యత్వం తీసుకునేలా చూడాలనీ , పార్టీలో బూత్ అద్యక్షుడు నుండి జాతీయ అధ్యక్షుడు వరకు అందరూ క్రియాశీల సభ్యత్వం తీసుకుటారని, క్రమశిక్షణ కలిగిన పార్టీ కార్యకర్తగా ప్రతి ఒక్కరూ క్రియాశీల సభ్యత్వం తీసుకోవాలని అన్నారు.

కార్యక్రమం అనంతరం కామారెడ్డి శాసన సభ్యులు కాటిపల్లి వెంకట రమణ రెడ్డి, బీజేపీ సీనియర్ నాయకులు మురళీధర్ గౌడ్, క్రియాశీల సభ్యులుగా బీజేపీ జిల్లా అధ్యక్షురాలు అరుణా తార, సభ్యత్వం ప్రభారి ఆలే భాస్కర్ చేతుల మీదుగా క్రియాశీల సభ్యత్వం తీసుకున్నారు.

Join WhatsApp

Join Now