Site icon PRASHNA AYUDHAM

1000 కోట్లు కేటాయించాలి

IMG 20240726 WA0059

బడ్జెట్లో ముదిరాజ్ కార్పొరేషన్ కు 1000 కోట్లు కేటాయించాలి

జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జల బిక్షపతి ముదిరాజ్
ప్రశ్న ఆయుధం 26జులై
కామారెడ్డి : తెలంగాణ రాష్ట్రంలో 56 లక్షల జనాభా ఉన్న ముదిరాజ్ ల అభివృద్ధికి ఈ బడ్జెట్లో 1000 కోట్లు కేటాయించాలని కామారెడ్డి జిల్లా ముదిరాజ్ సంఘం అధ్యక్షులు గజ్జల బిక్షపతి పేర్కొన్నారు. కామారెడ్డిలో శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ముదిరాజుల శ్రేయస్సుకోసం ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం అభినందనీయమని, అయితే ప్రస్తుతం కేటాయించిన 50 కోట్ల రూపాయలు సరిపోవని ఆయన అన్నారు. గత ఎన్నో సంవత్సరాలుగా ప్రభుత్వ సంక్షేమాలకు దూరంగా ఉంటున్న ముదిరాజులను ఆర్థికంగా సామాజికంగా ఆదుకోవాల్సిన అవసరం రేవంత్ రెడ్డి ప్రభుత్వం పై ఉందని ఆయన విజ్ఞప్తి చేశారు. 90 శాతం ముదిరాజులు దారిద్రరేఖకు దిగువగా ఉన్నారని రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన హామీ ప్రకారం ముదిరాజులను బిసి డి నుంచి ఏ గ్రూపుకు కుమార్చాలని ఆయన ప్రభుత్వాన్ని కోరారు. జీవో నెంబర్ 15 ప్రకారం గతంలో రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం ముదిరాజులను బీసీ ఏ గ్రూపుకు మార్చారని ఆయన తెలిపారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం బీసీ కమిషన్ ద్వారా ముదిరాజు ల స్థితిగతులపై అధ్యయనం చేసి 2009 లో జారీచేసిన జీవో నంబర్ 15 ను పునరుద్ధరించాలని గజ్జల బిక్షపతి కోరారు.

Exit mobile version